Skip to main content

Namaste NRI

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఒప్పందం

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు భారత దేశం సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందంపై మూడు నెలల్లోగా సంతకాలు జరుగుతాయని, ఆ తర్వాత అమల్లోకి వస్తుందని సమాచారం. భారత దేశం ఎగుమతి చేసే వస్తువులను నూటికి నూరు శాతం న్యూజిలాండ్‌ మార్కెట్‌లోకి అనుమతించడం, వీటిపై ఎటువంటి సుంకాలు విధించకపోవడం ఈ ఒప్పందంలో ముఖ్యాంశం. 5,000 మంది ప్రొఫెషనల్స్‌కు టెంపరరీ ఎంప్లాయ్‌మెంట్‌ ఎంట్రీ వీసాలు, 1,000 వర్క్‌, హాలిడే వీసాలు ఇవ్వడానికి కోటాను నిర్ణయించారు. రానున్న 15 ఏండ్లలో భారత్‌లో 20 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి న్యూజిలాండ్‌ అంగీకరించింది.

Social Share Spread Message

Latest News