Namaste NRI

విజయవంతంగా ముగిసిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌

న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ ను ఆమోదించారు. భారత్‌తో సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దీనికి మద్దతు తెలపడం ప్రపంచ ఏకాభిప్రాయానికి నిదర్శనంగా నిలిచింది. ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ డిక్లరేషన్ ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది.

ఆర్థికవృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ డిక్లరేషన్ ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ (అందరి సంక్షేమం, అందరి ఆనందం) అనే భారతీయ తాత్విక సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ డిక్లరేషన్‌ను రూపొందించారు. అన్ని దేశాలు తమ పౌరుల ప్రయోజనాల కోసం ఏఐని అభివృద్ధి చేసి, వినియోగించుకునేలా వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రాముఖ్యతను ఈ తీర్మానం నొక్కి చెప్పింది.

Social Share Spread Message

Latest News