నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆయ్. అంజి కే మణిపుత్ర దర్శకుడు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు. ఈ చిత్ర థీమ్‌సాంగ్‌ను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో వర్షం నేపథ్యంలో సినిమా తీస్తామని హీరో నితిన్ నాతో చెప్పారు. వర్షం కోసమే చాలా ఖర్చు పెట్టారు. సినిమా చూస్తే నిజంగా మనం వర్షంలో తడుస్తున్నట్లే ఉంటుంది అన్నారు. గోదావరి నేపథ్యంలో స్నేహం గురించి చెప్పే చిత్రమిదని నార్నే నితిన్ అన్నారు. ఈ కథ విని హాయిగా నవ్వుకున్నానని, ప్రేక్షకులు కూడా అదే విధంగా ఫీల్ అవుతారని బన్నీ వాసు చెప్పారు. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ది బెస్ట్ అవుతుందని దర్శకుడు అంజి కె మణిపుత్ర తెలిపారు.