ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తూ ఉద్యోగాలకు పెనుముప్పుగా మారిన కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మరింత పదునెక్కుతుందట. 2029 నాటికి మానవ మేధస్సును ఏఐ మించిపోనుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో రే కర్జ్‌వీల్ అనే ప్రఖ్యాత ఫ్యూచరిస్ట్ కూడా ఇదే అంచనా వేశారు. మానవుల మేధస్సును ఏఐ దాటాలంటే ఇంకో వందేండ్లు పదుతుందని కొందరు ఊహిస్తున్నారని, కానీ, ఇందుకు ఎక్కువ సమయం పట్టబోదని, మరో ఐదేండ్లలో ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, 1999లో కర్జ్‌వీల్ భవిష్యత్తులో ఏఐ ప్రభావం పెరిగిపోతుందని అంచనా వేయగా ఇప్పుడు అది నిజమయ్యింది.
