
హర్ష రోషన్, భాను, జయతీర్థలతో కలిసి సందీప్‌రాజ్ నటిస్తూ నిర్మించిన ఏఐఆర్( ఆల్ ఇండియా ర్యాంకర్స్) వెబ్‌సిరీస్. జోసెఫ్ క్లింటన్ దర్శకుడు. జూలై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోలు శివాజీ, సుహాస్ అతిథులుగా హాజరై మేకర్స్‌కి శభాకాంక్షలు అందించారు. నిర్మాత సందీప్‌రాజ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌కోసం ఏడాది కష్టపడ్డాం. మరో ఐదారు రోజుల్లో కంటెంట్ విడుదల కానుంది. ఇది అందరికీ కనెక్టయ్యే అద్భుతమైన జర్నీ. ఎమోషనల్ అవుతారు. పగలబడి నవ్వుతారు. అంత యూనివర్సల్ కంటెంట్ ఇది. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సిరీస్ ఇది అని తెలిపారు. కంటెంటే ఈ సిరీస్‌కి ప్రధాన బలమని దర్శకుడు చెప్పారు. ఇంకా ఈటీవీ ప్రతినిథులు సాయికృష్ణ, నితిన్‌లతో పాటు చాందిని, హర్షరోషన్ కూడా మాట్లాడారు.
