నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ అఖండ2 తాండవం. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. బ్లాక్‌బస్టర్ అఖండ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందమూరి తేజస్విని సమర్పకురాలు. ఈ చిత్రం షూటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో ఈ రోజున ఘనంగా మొదలైంది. కీలకమైన సన్నివేశాలను కుంభమేళాలో చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయని, దానికి తగ్గట్టే పానిండియా స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నామని మేకర్స్ తెలిపారు. గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ విలన్‌గా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే, సంగీతం: థమన్ ఎస్.