Skip to main content

Namaste NRI

అల్లంత దూరాన ట్రైలర్ విడుదల

విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా అల్లంత దూరాన. హ్రితిక శ్రీనివాస్ నాయికగా నటిస్తున్నది. చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్ చంద్రమోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు అలీ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ నిర్మాత చంద్రమోహన్ రెడ్డి మొదలుకుని సినిమా పట్ల ఎంతో ప్రేమ ఉన్న ప్రేమికులు చేసిన సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ లో కూడా అనుమతి తెచ్చుకుని మరీ కేరళ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు అని అన్నారు. అనంతరం నిర్మాత చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఈ సినిమాను నిర్మించాం. ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా ఉంటుంది. ఆద్యంతం మీ మనసుకు హత్తుకుంటుంది  అన్నారు. తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కళ్యాణ్ బోర్లగడ్డ, ఎడిటర్ : శివ కిరణ్

Social Share Spread Message

Latest News