Namaste NRI

అల్లరి నరేష్‌ ఆ ఒక్కటి అడక్కు.. విడుదల అప్పుడే

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఫరియా అబ్దుల్లా కథానాయిక.  మల్లి అంకం దర్శకుడు. చిలకా ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, జామీ లివర్‌, వైవా హర్ష, ఆరియానా గ్లోరీ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ర్టాల థియేట్రి కల్‌ హక్కులను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సొంతం చేసుకుంది. రెండు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. జ్యోతిష్యం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తాను వలచిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఓ యువకుడికి ఎదురైన సంఘటనలేమి టన్నదే సినిమా కథాంశం అని చిత్ర బృందం పేర్కొంది.  మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్‌, సహ నిర్మాత: భరత్‌ లక్ష్మీపతి, దర్శకుడు: మల్లి అంకం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress