అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్ చిలక నిర్మాత. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ నాన్నగారు తీసిన ఆ ఒక్కటీ అడక్కు చిత్రానికి, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అది జీవితంలో సెటిల్ కాకుం డానే పెళ్లి చేసుకునే వాడి కథ అయితే, ఇది సెటిల్ అయ్యాక కూడా పెళ్లికాని వాడి కథ. నా బలం కామెడీ. మంచి కంటెంట్ ఉన్న కామెడీ చిత్రమిది. ఈసారి ప్రేక్షకుల్ని మరింతగా నవ్వించాలనే ఈ సినిమా చేశా అన్నారు.
నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ జ్యోతిష్యం నేపథ్యంలో టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఫలా నా తేదీలోపు పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతావని జ్యోతిష్కుడు హీరోతో చెప్పడం, ఈ క్రమంలో పండే వినోదం, చివరగా హీరో పెళ్లి ప్రపోజల్ పెట్టగానే హీరోయిన్ ఆ ఒక్కటీ అడక్కు అని చెప్ప డం నవ్వుల్ని పంచింది. ఈవీవీ సత్యనారాయణగారి టైటిల్ తీసుకున్నాం కాబట్టి ఎంతో బాధ్యతగా సినిమా తీశామని, అల్లరి నరేష్ ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. టీజర్ మాదిరిగానే సినిమా ఆసాంతం కడుపుబ్బా నవ్విస్తుందని దర్శకుడు మల్లి అంకం పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్, దర్శకత్వం: మల్లి అంకం.