Namaste NRI

అల్లరి నరేశ్‌ కొత్త చిత్రం ప్రారంభం

అల్లరి నరేశ్‌ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్నిచిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.  ఔట్‌ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి  డెబ్యూ డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ డైరెక్షన్ నాగ్ అశ్విన్ చేశారు. జెమినీ కిరణ్, శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఇది చాలా మంచి కామెడీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు నా నుంచి కోరుకునే ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా అన్నీ ఇందులో వుంటాయి. ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది అని అన్నారు.

 నిర్మాత రాజీవ్‌ చిలక మాట్లాడుతూ దర్శకుడు మల్లి నాకు పదేండ్లుగా తెలుసు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు నరేష్‌ అయితే బాగుంటుందని అనుకున్నాం. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాం  అన్నారు. అల్లరి నరేశ్‌ 61వ సినిమా గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం : గోపీ సుందర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events