అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉగ్రం. షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.విజయ్ కనకమేడల దర్శకుడు. మేకర్స్థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. నగరంలో మిస్సింగ్ కేసుల వెనకున్న రహస్యాన్ని ఛేదించడానికి ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో అసాంఘికశక్తులు అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. పోలీస్ అధికారిగా అల్లరి నరేష్ తీవ్ర భావోద్వేగాలు కలబోసిన శక్తివంతమైన పాత్రలో కనిపించారు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: తూమ్ వెంకట్, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన-దర్శకత్వం: విజయ్ కనకమేడల. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.


