అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ఓ క్రేజ్ వుంది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాలు విజయంతమైన చిత్రాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అల వైకుంఠపురం చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచింది. కాగా ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం పట్టాలెక్కనుందని తెలిసింది.

అల్లు అర్జున్ -సుకుమార్ కలయికలో పుష్ప-2 పాన్ ఇండియా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ రెండు చిత్రాల తరువాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ లైన్‌ను ఇటీవల వినిపించడం, బన్నీ అందుకు గ్రీన్‌సిగ్న్ కూడా ఇచ్చాడని అంటున్నాయి సినీవర్గాలు.

