Namaste NRI

అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక ..స్పెషల్ అట్రాక్షన్‌గా విజయ్- రష్మిక జోడీ

టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కుమారుడు, యువ నటుడు అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జ‌రిగింది. వివాహానికి ముందు జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. పెళ్లికొడుకు వేడుకలో వరుడికి పసుపు రాయడం, పెద్దల ఆశీర్వాదాలు అందించడం వంటి సంప్రదాయ ఆచారాలు నిర్వహించారు. కుటుంబానికి చెందిన పెద్దలు, బంధువులు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుక అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ తన సోదరుడికి ఆశీస్సులు అందించగా, రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ దంపతులు, సాయి ధ‌ర‌మ్ తేజ్, నిహారిక‌, సురేఖ తదితరులు వేడుక‌లో పాల్గొన్నారు.

వేడుకలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్న కొత్త జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మంధాన కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ జంట వేడుక‌లో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. అల్లు కుటుంబంతో విజయ్, రష్మికలకు ఉన్న అనుబంధం మరోసారి స్పష్టమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events