Namaste NRI

అల్లు వారింట పెళ్లి సందడి..అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ

అల్లు శిరీష్-నయనికల వివాహం దగ్గర పడుతుండడంతో అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మార్చి 6న వీరి వివాహం జరగనుంది. కాగా ఇటీవల అల్లు అర్జున్ తన నివాసంలో టాలీవుడ్ ప్రముఖులకు. సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పార్టీ కి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, ఈ పార్టీ లో రామ్ చరణ్ దంపతులతో పాటు టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. దుబాయ్ లో ఈ మద్య బాచిలర్స్ పార్టీ కూడా చేశారు, ఆ పార్టీలో స్నేహితులు సందడి చేయగా తాజాగా టాలీవుడ్ లోని ప్రముఖులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. గత ఏడాది అక్టోబర్ లో నిశ్చితార్థం జరిగింది, ఇటీవల శిరీష్ తొలి శుభలేఖను తన మామయ్య చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events