Namaste NRI

దీపావళి కానుకగా అమరన్

శివకార్తికేయన్‌ హీరోగా నటించిన చిత్రం అమరన్‌. సాయిపల్లవి కథానాయిక. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతు న్న ఈ సినిమాకు పెరియస్వామి రచన, దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటైర్టెన్మెంట్‌తో కలిసి విఖ్యాత నటుడు కమల్‌హాసన్‌, ఆర్‌.రామచంద్రన్‌ ఈ సినిమాను నిర్మిస్తు న్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న సినిమా విడుదల కానుంది.

కాగా, హీరో నితిన్‌ తండ్రి, ప్రముఖ పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి, అతని సోదరి నిఖితారెడ్డి ఈ సినిమా ఏపీ, తెలంగాణ థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.  శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా తాను నిర్మిస్తున్న అమరన్‌ కూడా విడుదల అవుతుం డటం పట్ల కమల్‌ ఆనందం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ చూడని కొత్త తరహా పాత్రలో శివకార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్‌ సాయి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress