టెక్ దిగ్గజం అమెజాన్ మరో దఫా పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నది. దాదాపు 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు, ప్రైమ్ వీడియో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు తెలుస్తున్నది. జూన్ 2026 నాటికి సంస్థలోని 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నది.

అమెజాన్ 2025లో రీస్ట్రక్చరింగ్ డ్రైవ్ పేరుతో ఉద్యోగాల తొలగింపును చేపట్టింది. తొలి దశలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో 14 వేల మందిని విధుల నుంచి తొలగించింది. బ్లిండ్, రెడిట్ సహా పలు సోషల్‌మీడియా వేదికలపై అమెజాన్ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. భారత్‌లోని వివిధ నగరాల్లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగులంతా రిస్క్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.















