అమెజాన్‌ను చెందిన వెబ్ సర్వీసెస్ ఆసియా ఫసిఫిక్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దీని ద్వారా వచ్చే ఎనిమిదేళ్లలో 2030 నాటికి రూ.36,300 కోట్ల పెట్టుబడులతో, ఏటా సగటున 48 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ పేర్కొంది. ఈ కేంద్రం పరిధిలో గల ఆసియా పసిఫిక్ దేశాల్లోని మూడు అవైలబిలిటీ జోన్‌కు సేవలందిస్తామని తెలిపింది. భారత్‌తో అమెజాన్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రెండో కేంద్రంగా హైదరాబాద్. డేటా సెంటర్ల ద్వారా భాగస్వామ్య సంస్థలు, అంకురాలు, వినియోగదారులకు భద్రతతో కూడిన సురక్షిత, వేగవంతమైన సేవలను ఈ కేంద్రం అందిస్తుందని అమెజాన్ డేటా, మౌలిక వసతుల సేవా విభాగం ఉపాధ్యక్షుడు ప్రసాద్ కల్యాణరామన్ తెలిపారు.
హైదరాబాద్ కేంద్రం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజ్, డేటాబేస్, నెట్‌వర్కింగ్, అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అప్లికేసన్ డెవలప్‌మెంట్, ఆగ్మెంటెండ్ రియాలిటీ వంటి 200 కంటే ఎక్కువ సాంకేతిక సేవలు, అత్యుత్తమ మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. 203 నాటికి సుమారు రూ.62 వేల కోట్ల ( 7.6 బిలియన్ డాలర్ల) మేరకు స్థూల జాతీయోత్పత్తికి తోడ్పాటునందిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2020 నవంబరు 6న ప్రకటించింది. మూడు ప్రాంతాల్లో అమెజాన్ అవైలబిలిటీ జోన్లు (డేటా కేంద్రాలు) ఏర్పాటు చేస్తామని వెల్లడిరచింది. ప్రభుత్వపరంగా మంత్రి కేటీఆర్ స్పందించి భూకేటాయింపులు జరిపించారు. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలోని ఎలక్ట్రానిక్ సిటీలో 50, కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 48, షాబాద్ మండలం చందనపెల్లిలో 38 ఎకరాలను కేటాయించగా అక్కడ అమెజాన్ నిర్మాణాలు చేపట్టింది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేంద్రం ప్రారంభాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.