
అనంతిక సునీల్‌కుమార్ లీడ్‌రోల్ పోషించిన చిత్రం 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ సినిమా విజువల్‌గా చాలా బాగుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఒక అమ్మాయి జీవిత ప్రయాణమే 8 వసంతాలు సినిమాగా మీ ముందుకొస్తోంది. తప్పకుండా మీకు నచ్చుతుంది అన్నారు. ఇది చాలా డిఫరెంట్ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అని నవీన్ యెర్నేని అన్నారు. ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ మా నిర్మాతలు ఒక మంచి కథతో వస్తే సినిమా తీస్తారు అనే దానికి మా 8 వసంతాలు చిత్రం ఓ నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించారనే పేరు వారికి వస్తుంది. అనంతిక నటన ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ అని అన్నారు. అనంతిక మాట్లాడుతూ మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఫణీంద్ర గారి వల్ల ఈ సినిమాలో ఒక బలమైన పాత్రను చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం అన్నారు.
