గౌతమ్‌కృష్ణ, పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం సోలో బాయ్. నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాత. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణార్థం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.

మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబించే కథతో ఈ సినిమా రూపొందిందని, తారాగణంతో పాటు టెక్నికల్ బృందం కూడా మనసు పెట్టి పనిచేశారని దర్శకుడు తెలిపారు. హీరో గౌతమ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని నిర్మాత సతీష్ నమ్మకం వెలిబుచ్చారు. ఇందులో కంటెంటే హీరో అని, దర్శకుడు నవీన్ అద్భుతంగా సినిమా చేశారని హీరో గౌతమ్ కృష్ణ తెలిపారు. ఇంకా నిర్మాత దామోదర ప్రసాద్, సుధాకర్, దర్శకుడు యాట సత్యనారాయణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా మాట్లాడారు.
