Namaste NRI

టీడీపీ ఎన్నారై యూరప్ ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వేడుకలు

టీడీపీ ఎన్నారై  యూరప్ ఆధ్వర్యంలో డబ్లిన్ (ఐర్లాండ్), కోపెన్హాగన్ (డెన్మార్క్), వాలెట్టా (మాల్టా) నగరాల్లో మహానాడు -2025 వేడుకలు అట్టహాసంగా జరిగాయి.  ఈ కార్యక్రమం తెలుగువారి ఐక్యతకు అద్దంపడుతూ, సామాజిక, రాజకీయ చైతన్యానికి వేదికగా నిలిచింది.కార్యక్రమంలో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ (పీపీడీ) వర్క్‌షాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, వీసా సందేహాలున్నవారికి 6 గంటలపాటు మెంటరింగ్ అండ్ మానిటరింగ్ ద్వారా మార్గదర్శకత్వం అందించారు.

తెలుగు మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మహానాడును ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ 102వ జయంతి, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం, పద్మభూషణ్ పురస్కారం సందర్భంగా కేక్ కటింగ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ ఐర్లాండ్  రీజినల్ కోఆర్డినేటర్ డా. కిషోర్ బాబు చలసాని నాయకత్వం వహించి సభ్యులను ఉద్దేశించి ముఖ్య ప్రసంగం చేశారు. ఐర్లాండ్ మహానాడు నిర్వహణతో పాటు మొత్తం యూరప్ స్థాయిలో సమన్వయంతో సమగ్రంగా ఈ మహానాడు విజయవంతంగా కొనసాగించేందుకు చొరవ చూపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎన్‌ఆర్‌టీ  చైర్మన్ డా. రవికుమార్ వేమూరి జూమ్ ద్వారా పాల్గొని టీడీపీ ఐర్లాండ్ చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇటువంటి వర్క్‌షాప్‌లకు ఒక ఎస్ఓఫీ (స్టాండర్డ్ ఆపరేసింగ్ ప్రొసీజర్) రూపొందించి పంపించాలని ఆదేశించారు.ఈ ప్రతిపాదనలను విశ్లేషించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి కోసం భవిష్యత్తు లో ఇతర దేశాల్లో కూడా అమలు చేద్దామన్నారు. సీఎక్స్‌ఓ క్లబ్, వృత్తి అభివృద్ధి వేదికల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన 2 మిలియన్ ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వర్క్‌షాప్ తోడ్పడుతుందని తెలిపారు.ఎక్స్‌‌పోర్టు-ఇంపోర్టు బిజినెస్ అభివృద్ధికి ఏపీఎన్‌ఆర్‌టీ దోహదపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నారైలు అర్ధ భాగస్వాములు అయితే సగ భాగాన్ని ఏపీఎన్ఆర్‌టీ భరించేలా ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఏపీఎన్‌ఆర్‌టీ డైరెక్టర్ శేషుబాబు కానూరి కూడా అతిథిగా హాజరై, ఎన్నారైలంతా ఏపీఎన్ఆర్‌టీ భాగస్వాములుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహానాడు ఘనంగా నిర్వహించినందుకు టీడీపీ యూరప్ కృషిని ప్రశంచించారు. కాట్రగడ్డ వేంకట కృష్ణ ప్రసాద్ ఏపీఎన్‌ఆర్‌టీ సభ్యులకు లభించే ఉపయోగాలు, ప్రోత్సాహకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యూరప్ నాయకులూ విజయ్ అడుసుమిల్లి, శ్యామ్ సుందర్ ఉట్ల , శ్రీనివాస్ గోగినేని, చందు కాట్రగడ్డ, స్వాతి రెడ్డి జూమ్ ద్వారా పాల్గొన్నారు.

ఐర్లాండ్ లో నిర్వహించిన మహానాడు విజయవంతానికి శ్రీనివాస్ పుట్టా, కిషోర్ బాబు చలసాని, వేంకట కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, అచ్చుత కిషోర్ కొత్తపల్లి, భరత్ భాష్యం (ఐర్లాండ్ అధ్యక్షులు ), రాజేష్ బాబు పల్లేటి, దీప్తి కొణిదల, శివ వేములపల్లి, కోటేంద్ర లేళ్ల, రంగ గల్లా, ప్రముఖ్ గోగినేని, శ్రీను, శుభాకర్ రామినేని, హరీష్ గణపనేని, రామ్ వంగవోలు, శ్రీకర్ మల్లికార్జున్ గుత్తా, డెన్మార్క్ లో అమర్నాథ్ పొట్లూరి, యాగంటి బాలకృష్ణ, హరి చెరుకూరి, మాల్టా లో సుమంత్ బాబు పద్మాల, సతీష్ ముళ్ళపూడి, షేక్ అజహరుద్దీన్, లత ముళ్ళపూడి, నరేష్ చౌదరి తలపనేని, గౌరవ్ జోషి మహానాడు విజయవంతానికి కృషి చేశారు.

ఈ మహానాడు కార్యక్రమం యువతలో చైతన్యం నింపుతూ, పరస్పర సహకారంతో, విశాల దృష్టితో, టీమ్ యూరప్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. అంతేకాక షడ్రుచులతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events