సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు. డైరెక్టర్ మాట్లాడుతూ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాను యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాం. లవ్‌స్టోరీతోపాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఊరిలో జరిగే ఈ కథలో కులాల ప్రస్తావన ఉంటుంది. ఎవరినీ కించపరిచే అంశాలు దీంట్లో ఉండ వు అని తెలిపారు. నేను నిర్మాతగా మీ ముందు నిలబడటానికి కారణం అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు కథ వినగానే బన్నీ వాస్ గారు, నేను ఎైగ్జెట్ అయ్యాం అని నిర్మాత ధీరజ్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శివాని నాగరం కథానాయిక. సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: ధీరజ్ మొగిలినేని, దర్శకత్వం: దుశ్యంత్ కటికినేని.
