ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలని అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి. అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకుని హౌతీ రెబెల్స్ మరోసారి వాణిజ్య నౌకలపై దాడులకు దిగింది. పేలుడు పదార్థాల నిండిన డ్రోన్ పడవ పేలింది. అయితే దానివల్ల ఎలాంటి నష్టం జరుగలేదని యూఎస్ నేవీ తెలిపింది. కాగా, దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్య ఉంటాయ అమెరికా ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 24 గంటల వ్యవధిలోనే మరోదాడి జరగడం విశేషం.
