Namaste NRI

ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ షాక్

అమెరికా మాటలను పెడచెవిన పెట్టి గాజాలోకి చొచ్చుకెళ్తున్న ఇజ్రాయెల్ కు ఓ షాక్ ఎదురైంది. వాషింగ్టన్ నుంచి అందాల్సిన కేలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కోటి 900 కిలోల బరువు ఉండే 1800 బాంబులు, 226 కిలోల బరువు ఉండే మరో 1700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు. ఈ విషయాన్ని బైడెన్ కార్యవర్గం లోని కీలక అధికారి ధ్రువీకరించారు. రఫాలో పౌరుల భద్రత, వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళనలు పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం రఫాలో దాదాపు 10 లక్షల మందికి పైగా తలదాచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో రఫాలో భారీ ఆపరేషన్లు చేపట్టకూడదని, ఆ ప్రాంతం లోకి మానవీయ సాయం పంపించేందుకు మార్గాలను అన్వేషించడానికి వీలుగా చర్చలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రఫాలో వాడుతుందని అనుమానిస్తున్న ఆయుధాల ఎగుమతిని పునః సమీక్షిస్తున్నాం అని అమెరికా వర్గాలు వెల్లడించాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events