
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రం ప్ అక్రమ వలసదారులను బలవంతంగా పంపివేయడంతో చాలా మంది ఇక్కట్ల పాలయ్యారు. బ్రెజిల్ కు చెందిన అక్రమ వలసదారులను యూఎస్ నుంచి బలవంతంగా సైనిక విమానాల్లో చేతులకు బేడీలు వేసి మ రీ పంపివేశారు. అమెరికా నుంచి నాలుగు గంటలు ప్ర యాణించి దాదాపు 88 మంది బ్రెజిలియన్లు మనాస్ విమానాశ్రయం చేరారు. తమను చేతులకు బేడీలు వే సి సైనిక విమానంలో బలవంతంగా కుక్కి, బ్రెజిల్ కు పంపించారు. ఆ విమానాల్లో మంచినీళ్లుకానీ, ఏసీ కా నీ, కనీసం బాత్ రూమ్ కు వెళ్లే సౌకర్యం కానీ లేవని బ్రెజిల్ చేరినవారు వాపోయారు. గడ్డకట్టే చలిలో, ఏసీ లేకుండా నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించినట్లు వారు పేర్కొన్నారు. తమ పౌరులను చేతులకు బేడీలు వేసి , బలవంతంగా సైనిక విమానంలో పంపిన అమెరికా చర్యను బ్రెజిల్ ఖండించింది. దుర్భర పరిస్థితుల్లో బ్రెజిల్ చేసిన వారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో తమ గోడు వినిపించారు.















