
అమెరికాలో మరో తుఫాన్ విరుచుకుపడి మూడు రాష్ర్టాలపై పంజా విసిరింది. శనివారం ప్రారంభమైన ఈ తుఫాన్ టెక్సాస్, ఓక్లహామా, అర్కెన్సాస్ రాష్ర్టాలను కుదిపేసింది. ఈ తుఫాన్ విధ్వంసానికి 11 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది విద్యుత్తు లేక అంధకారంలో మగ్గారు. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. రాష్ర్టాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలువురు ప్రయాణికులు రహదారులపై చిక్కుకుపోయారు.
