అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. లోవా స్టేట్‌లోని పెర్రీ హైస్కూల్‌లో చొరబడిన ఓ టీనేజర్ హాండ్‌గన్, షాట్‌గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆరో తరగతి చదవుతున్న ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీ సులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా చనిపోయి నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా టీనేజర్ కాల్పులు జరిపాడని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ మిచ్ మోర్ట్‌వెడ్ వెల్లడించారు. గాయపడినవారిలో నలుగురు విద్యార్థులు ఉండగా, మరొకరు స్కూల్ అడ్మినిస్ట్రేటర్ అని తెలిపారు. ఈ శీతాకాల సెలవులు ముగిసిన తర్వాత మొదటిసారిగా స్కూల్ ఓపెన్ అయిందని, ఇంతలోనే కాల్పుల ఘటన చోటుచేసుకున్నదని వ్యాఖ్యానించారు.
