టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం డ్రాప్ ఇన్ పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఫ్లోరిడా నుంచి కంటైనర్‌లో 10 డ్రాప్ ఇన్ పిచ్‌లను న్యూయార్క్ కు తరలించారు. ఇందుకోసం సుమారు 20 కంటైనర్‌లను ఉపయోగించారు. న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మధ్యలో 4, నెట్స్‌లో 6 పిచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ పేర్కొంది. జూన్ 3న శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు న్యూయార్క్ ఆతిథ్యమివ్వనుంది. ఇదే వేదిక లో జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది.
