అమెరికా బిలియనీర్ వేల కోట్ల కంపెనీనే దానంగా ఇచ్చేశాడు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెటగోనియా ఫ్యాషన్ సంస్థ పౌండర్ యోవోస్ చుయ్నార్డ్ రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలు, కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్చంద సంస్థకు బదిలీ చేశాడు. ఈ మొత్తాన్ని వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడే సంస్థలు, కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. సంస్థకు రాసిన లేఖలో ఈ భూమే ఇప్పుడు మనకున్న ఏకైక వాటాదారు అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడిరచారు.