శ్యామ్‌సంగ్ వైస్ చైర్మన్ జయ్ వై.లీని దక్షిణ కొరియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 18 నెలల జైలు జీవితం గడిపిన జయ్ వై లీ ఏడాది క్రితం పెరోల్‌పై విడుదల అయ్యారు. ఆయన ఏడాది క్రితం పొందిన పెరోల్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం షరతులు విధించింది. ఐదేండ్లు ఉద్యోగ బాధ్యలు చేపట్టారాదని, బోర్డుకు హాజరు కాకుండా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సమర్పించే నివేదికలను మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఆయనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రత్యేకంగా క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. ఈ నెల 15న దేశ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్బంగా యూన్ సుక్ యోల్ ఈ క్షమాభిక్ష ప్రకటన చేస్తారు. తొలుత జయ్ వై లీకి 30 నెలల జైలు శిక్ష విధించారు. అయితే, ఆయన అరెస్ట్‌కు కారణమైన దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై ప్రభుత్వం తదుపరి కుప్పకూలింది. జయ్ వై.లీకి ప్రభుత్వ క్షమాభిక్ష లభిచండంతో శ్యామ్‌సంగ్ బోర్డులో చేరేందుకు వివిద సంస్థల, దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది.














