ఇండియన్ – బ్రిటిష్ బాలుడు క్రిష్ అరోరా (10) మేధాశక్తిలో రికార్డు సృష్టించాడు. ఐక్యూ స్కోర్ 162 సాధించి, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను మించిపోయాడు. దీంతో ప్రపంచంలోని 1 శాతం అత్యంత మేధావుల సరసన చేరిపోయాడు. అంతేకాకుండా, అత్యంత మేధావుల సొసైటీ మెన్సాలోకి ప్రవేశించాడు. బ్రిటన్‌లో గొప్ప పేరు, ప్రతిష్ఠలున్న క్వీన్ ఎలిజబెత్స్ స్కూల్‌లో సెప్టెంబరులో చేరబోతున్నాడు. క్రిష్ మాట్లాడుతూ కొత్త పాఠశాల తన సత్తాకు మెరుగైన సవాళ్లను విసురుతుందని ఆశిస్తున్నానని తెలిపాడు.