75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు, దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు, జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకోపోవడం వల్ల మరణించాడా లేక, నీళ్లను చూసి గుండేపోటుతో మరణించాడా అనేది ఇంకా తెలియాల్సి ఉందని దుబాయిలోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు యస్వీరెడ్డి తెలిపారు.