Namaste NRI

గంట అంతరాయం.. 25 వేల కోట్లు నష్టం

మెటా సీఈవో జుకర్‌ బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్ట పోయారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది. దీంతో మెటా షేర్లు క్షీణించాయి. బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్‌ సంపద సుమారు 3 బిలియన్లు తగ్గి 176 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కుబేరుల్లో అతను నాల్గో స్థానంలో కొనసాగు తున్నాడు. మంగళవారం మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఫలితంగా జుకర్‌బర్గ్‌ నికర విలువకు కోత పడింది.

Social Share Spread Message

Latest News