
శ్రీఇంద్ర హీరోగా నటిస్తూ నిర్మించిన యాక్షన్ అడ్వెంచర్ ఆనాథ. ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. నికిత స్వామి, యుక్త పెర్వి కథానాయికలు. కె.ఎ.అన్నాసేట్ దర్శకుడు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. యువతరానికి కావాల్సిన అన్ని హుంగులు ఈ సినిమాలో ఉంటాయని, పర్టిక్యులర్‌గా మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత, హీరో శ్రీఇంద్ర తెలిపారు. అశ్విని, యశ్వంత్, శోభరాజ్ తదితరులు ఇతర పాత్రలుపోషించిన ఈ చిత్రానికి కెమెరా: వీరేష్ కుమార్.
