రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందుతోన్న కమర్షియల్ ఎంటైర్టెనర్ ఆంధ్రాకింగ్ తాలూకా. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రిలో మొదలైన తాజా షెడ్యూల్‌లో రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా నటిస్తుండగా, ఆయన డైహార్డ్ ఫ్యాన్‌గా రామ్ కనిపించనున్నారు. హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో మాస్ ప్రేక్షకులను మెప్పించే లా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో రావురమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నూని, సంగీతం: వివేక్-మెర్విన్.
