అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను వచ్చే వారంలో వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. కొలరాడోలోని ఆస్పెన్‌లో కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో రూ.5,000 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో వంటి ప్రముఖులు హాజరుకాబోతున్నారు. జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కు 2019లో విడాకులు ఇచ్చారు.