Namaste NRI

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్‌ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏండ్ల అచింత షూటి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ పతాకాల సంఖ్య ఆరుకు చేరింది. స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్‌ చేసిన బెంగాల్‌ లిఫ్టర్‌ అచింత తర్వాతి ప్రయత్నంలో 140 కేజీలు, మూడో ప్రయత్నంలో 143 ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు.  దీంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు సాధించిన ఆరు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలోనే కావడం విశేషం. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events