Namaste NRI

ట్రంప్‌ పాలకవర్గంలో మరో భారత అమెరికన్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌  మరో మూడువారాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తన పాలకవర్గంలో ఒక్కొక్కరిని నియమించుకుం టున్నారు. ఈ క్రమంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటుకల్పించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (ఏఐ) పాలసీ అడ్వైజర్‌గా వ్యాపారవేత్త శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించారు. వైట్‌హౌస్‌ ఆఫీస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో ఆయన సేవలు అందిస్తారని ప్రకటించారు.

కృష్ణన్‌ గతంలో మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, యాహూ, ఫేస్‌బుక్‌, స్నాప్‌ సంస్థల్లో పనిచేశారు. ఇప్పుడు శ్వేతసౌధం ఏఐ క్రిప్టో జార్‌ డేవిడ్‌ ఓ శాక్స్‌తో కలిసి కృష్ణన్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు.  కృష్ణన్‌ స్పందిస్తూ.. దేశానికి సేవచేయడానికి తనకు గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు. ఏఐలో అమెరికా నాయకత్వా న్ని కొనసాగించడం కోసం డేవిడ్‌ శాక్స్‌తో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. ఇక కృష్ణన్‌ నియామకాన్ని అమెరికాలోని భారత కమ్యూనిటీ స్వాగతించింది.

Social Share Spread Message

Latest News