Namaste NRI

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం  

బంగ్లాదేశ్‌లోని మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపితగా బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ పేరును తొలగించింది. ఈ మేరకు ఆ దేశ లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ సంబంధాల మంత్రిత్వ శాఖ ఆర్డినెన్స్‌ జారీచేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు,  పదానికి కొత్త నిర్వచనం ఇస్తూ, ఓ చట్టాన్ని యూనస్‌ ప్రభుత్వం సవరించిందని, జాతిపిత అన్న బిరుదును షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌కు తొలగించింది.

మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగించిన కొద్ది రోజుల్లోనే యూనస్‌ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధానికి యూనస్‌ ప్రభుత్వం కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. బంగబంధు స్వాతంత్య్ర పిలుపు మేరకు యుద్ధం జరిగిందని, బంగ్లాదేశ్‌ విమోచనం పొందిందని ఇంతకుముందున్న చట్టం పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News