Namaste NRI

కరోనా వైరస్‌లో మరో కొత్త వేరియంట్

కరోనా వైరస్‌ మరింత బలపడుతూ  కొత్త వేరియంట్లు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. సి.1.2గా పిలిచే ఓ వేరియంట్‌ బయటపడినట్టు రెండు రోజుల క్రితమే తేలగా, మరో ఉత్పపరివర్తనం తాజాగా మూ అనే వేరియంట్‌ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడిరదని పేర్కొంది. మూ ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌గా గుర్తించినట్టు వివరించింది. అయితే ఈ వేరియంట్‌కు టీకాలను ఏమార్చే గుణాలున్నాయని దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడిరచింది. ఈ మూ వేరియంట్‌ బయటపడడంపై ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

                 కరోనా నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి వల్ల ఈ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని భావిస్తున్నారు. కొవిడ్‌ ఉత్పరివర్తనంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, డెల్టా లాంటి వేరియంట్లు విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల రేటు మళ్లీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆల్ఫా 193 దేశాల్లో విస్తరించగా, 170 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ప్రభావం చూపే మరో రెండు వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగించే అంశం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress