కరోనా వైరస్ మరింత బలపడుతూ కొత్త వేరియంట్లు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. సి.1.2గా పిలిచే ఓ వేరియంట్ బయటపడినట్టు రెండు రోజుల క్రితమే తేలగా, మరో ఉత్పపరివర్తనం తాజాగా మూ అనే వేరియంట్‌ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడిరదని పేర్కొంది. మూ ను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా గుర్తించినట్టు వివరించింది. అయితే ఈ వేరియంట్‌కు టీకాలను ఏమార్చే గుణాలున్నాయని దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడిరచింది. ఈ మూ వేరియంట్ బయటపడడంపై ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి వల్ల ఈ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని భావిస్తున్నారు. కొవిడ్ ఉత్పరివర్తనంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, డెల్టా లాంటి వేరియంట్లు విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల రేటు మళ్లీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆల్ఫా 193 దేశాల్లో విస్తరించగా, 170 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ప్రభావం చూపే మరో రెండు వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగించే అంశం.