
కోలీవుడ్ స్టార్ యాక్టర్ జయం రవి తన సతీమణితో 15 ఏండ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులను ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలు, కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కఠిన నిర్ణయం తీసుకున్నాం. ప్రతీ ఒక్కరూ మా ప్రైవసీని గౌరవిస్తారని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయిన సుజాత విజయ కుమార్ కూతురు ఆర్తి. జయం రవి-ఆర్తికి ఇద్దరు కుమారులు. జయం రవి చివరగా పొన్నియన్ సెల్వన్ 2తో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. జయం రవి ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా, షూటింగ్ దశలో ఉన్నాయి.
