
భారతీయులతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన లక్షలాది మందికి అమెరికా మరో షాక్ ఇచ్చింది. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న సమయంలో ఉద్యోగం కోల్పోకుండా రక్షణ కల్పిస్తున్న 540 రోజుల ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు రూల్ను రద్దు చేస్తున్నట్టు యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. దీంతో హెచ్-4 వీసా కలిగిన జీవిత భాగస్వాములు, హెచ్-1బీ వీసా కలిగిన భారతీయుల భాగస్వాములు ఇబ్బంది పడతారు. వర్క్ పర్మిట్ రద్దు అయితే వారు ఉద్యోగం చేయడానికి వీలుండదు. గతేడాది అక్టోబర్ 30 తర్వాత రెన్యువల్ దరఖాస్తులు సమర్పించిన వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఎఫ్-1 స్టెమ్ విద్యార్థులకు మాత్రం 180 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు కొనసాగుతుందని యూఎస్ స్పష్టం చేసింది.















