
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో విశిష్ట గౌరవం లభించింది. గోవాలో (నవంబర్ 20) గ్రాండ్‌గా ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకల్లో బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందనలు తెలియజేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో ఈ సన్మానం జరగడం విశేషం. సినీ పరిశ్రమలో నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గౌరవం అందించారు.
















