అమెరికాలో భారత సంతతి వ్యక్తుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భారతీయ అమెరికన్ వివేక్ తనేజ (41) మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్‌లో దాడి జరిగింది. ఓ వ్యక్తి అతన్ని తీవ్రంగా కొట్టాడు. అతని తల పేవ్మెంట్‌ను ఢీకొనడంతో రక్తస్త్రావం జరిగింది. ఆ రోజున ఓ రెస్టారెంట్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రాత్రి రెండు గంటలకు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ నెట్టేసుకున్నారు. అయితే గొడవ పెద్దగ కావడంతో అతనిపై అటాక్ జరిగింది. వివేక్ తనేజ ఆ అటాక్‌లో స్పృహ కోల్పోయాడు. చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జరుగుతు న్నట్లు చెప్పారు. ఆ వ్యక్తిని ఇంకా గుర్తించలేదన్నారు. అటాకర్ ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్లు రివార్డు ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు.
