వయసును రివర్స్ చేసుకునే సీక్రెట్ సప్లిమెంట్స్ తనవద్ద ఉన్నాయంటున్నారు అమెరికాకు చెందిన మిలియనీర్ బ్రయాన్ జాన్సన్. ఈ సప్లిమెంట్స్‌ను తీసుకొని తాను 5.1 ఏండ్ల వయసును రివర్స్ చేసుకున్నట్టు చెప్తున్నారు ఈ 46 ఏండ్ల వ్యాపారవేత్త. ఈ వయసును రివర్స్ చేసుకునే సప్లిమెంట్స్‌కు ఆయన ప్రాజెక్ట్ బ్లూప్రింట్ అని పేరు పెట్టారు. వీటి తయారీకి జాన్సన్ రూ.16 కోట్లు ఖర్చు చేశారట. డ్రింక్ మిక్స్, ట్యాబ్లెట్లు, పలు ఔషధాలతో కూడిన సప్లిమెంట్స్‌ను ఆయన అమ్మకానికి పెట్టారు. నెల రోజులకు సరిపడే సప్లిమెంట్స్ ధరను రూ.28 వేలుగా నిర్ణయించారు. వయసును రివర్స్ చేసుకోవడంపై ఆసక్తి చూపించే జాన్సన్ పలు రకాల ప్రయోగాలు చేపట్టి చివరికి ఈ సప్లిమెంట్స్‌ను రూపొందించారు. అయితే, వీటి పనితీరును నిర్ధారించడానికి మాత్రం ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు.