
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇందులో గర్భగుడి వెల్ నెస్ సెంటర్‌ని నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిశోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్సకు వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాడే పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే, అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో అంటూ సాగే ఈ వినోదాత్మక గీతాన్ని బాలవర్థన్ రాయగా, సునీల్ కశ్యప్ స్వరపరిచారు. వెన్నెల కిశోర్ స్వయంగా ఈ పాట పాడటం విశేషం. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్ రాఘవ్, కెమెరా: మహిరెడ్డి పండుగుల.
















