Namaste NRI

అనుష్క ఘాటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

అనుష్క ప్రధాన  పాత్రల్లో  రూపొందుతోన్న చిత్రం ఘాటీ. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమని తెలుస్తున్నది. ఇందులో అనుష్క పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్‌లో  అనుష్క బస్‌లో ఓ వ్యక్తిని మర్డర్‌ చేసే సన్నివేశం సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. ైక్లెమాక్స్‌ షూట్‌ మాత్రమే మిగిలివుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా నడుస్తున్నది. జనవరి చివరివారం నుంచి ైక్లెమాక్స్‌ షూట్‌ ఉంటుందని తెలుస్తున్నది. ఏప్రిల్‌ 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాయిమాధవ్‌ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress