
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతం అయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు హెచ్చరించారు. 2050 తర్వాత వచ్చే 6 వేల ఏండ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవ్వొచ్చని వారు వెల్లడించారు. వచ్చే పదిహేనేండ్లలో అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్(ఏఎంఓసీ) వ్యవస్థ పతనమవుతుందని, ఈ పరిణామం జీవావరణ వ్యవస్థ, మానవ సమాజాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, పాట్స్‌డమ్ వాతావరణ ప్రభావ పరిశోధన సంస్థ పరిశోధకుల బృందం తెలిపింది.
