రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పెద్ది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫస్ట్ గ్లింప్స్ మొదలుకొని, కొద్ది రోజుల క్రితం విడుదలైన చికిరి చికిరి పాట వరకూ ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాకు మరింత ఊపుని తీసుచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని ప్రధాన పాత్రల్ని ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతిబాబు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. నెగెటివ్ షేడ్స్‌తో సాగే ఈ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాణం: వృద్ధి సినిమాస్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.















