హీరో నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం కోర్ట్- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ ఉపశీర్షిక. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా. ఇందులో చాలా సెన్సిటివ్ ఇష్యూని డీల్ చేశాం. సినిమా పూర్తయ్యాక నిలబడి క్లాప్స్ కొడతారు. ఇది నా గ్యారంటీ. అద్భుతమైన కోర్ట్ డ్రామాతో పాటు అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఓ అడుగు ముందుకు వేసినట్లే అన్నారు. ఒక్క సిట్టింగ్ లోనే కథను ఓకే చేశానని, అంతలా నచ్చిందని ప్రియదర్శి తెలిపారు. గొప్ప బాధ్యతగా ఈ సినిమా చేశానని దర్శకుడు పేర్కొన్నారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో రోషన్, శ్రీదేవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
